నిర్భయ దోషుల తరపు లాయర్ కు షాక్ – సోషల్ మీడియాలో కామెంట్లు

నిర్భయ దోషులకుఉరి శిక్ష డేట్ వచ్చేసింది.. ఎక్కడ? ఎప్పుడు?

0
94

నిర్భయ దోషులకు ఉరి శిక్ష విధించింది పటియాలా కోర్టు, దేశంలో అందరూ ఈ శిక్ష కరెక్ట్ అంటున్నారు, దీని కోసం ఏడు సంవత్సరాలుగా మహిళా లోకం ఎదురుచూస్తోంది, అంత దుర్మార్గం చేసిన వారికి వెంటనే శిక్ష వేయకపోవడం పై విమర్శలు వచ్చినా నేటి తీర్పుపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై దోషుల తరపు న్యాయవాది ఏ పీ సింగ్ మీడియాతో మాట్లాడారు.

డెత్ వారెంట్ పై సుప్రీంకోర్టుకు వెళతామని ఏ పీ సింగ్ తెలిపారు..ఈ నెల 22న ఉదయం 7గంటలకు ఉరిశిక్షను అమలు చేయాలని తీర్పును ప్రకటించింది. ఇక నిర్బయ తల్లివేసిన పిటిషన్ పై ఈ తీర్పు వచ్చింది, అయితే దోషుల తరపు లాయర్ మీడియాతో మరికొన్ని కామెంట్లు చేశారు..

విచారణ నిష్పక్షపాతంతో జరగలేదని ఆయన ఆరోపించారు. ఈ దేశంలో ఉరి తాడు పేదవారికోసమే తయారు చేస్తున్నారు. వారికే ఉరిశిక్ష పడుతోంది. సంపన్నులకు ఉరిశిక్ష వేయరని సింగ్ వ్యాఖ్యానించారు. అయితే లాయర్ మాటలపై మహిళాలోకం భగ్గుమంటోంది.. అసలు చంపింది వారు కాదా? విచారణ సరిగ్గా జరగలేదు అంటున్న లాయర్ గారు, మరి నిర్భయ కేసులో వీరు నలుగురు ఏ పాపం చేయలేదా? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.