షాకింగ్- పన్నెండేళ్లుగా రోజుకు అరగంటే నిద్ర..ఎందుకో తెలుసా?

Shocking- Sleep half an hour a day for twelve years..do you know why?

0
54

మనకు రెండు మూడు రోజులు వరుసగా ఓ గంటా రెండు గంటల నిద్ర తగ్గితే ఒంట్లో ఉత్సాహం కూడా తగ్గినట్లనిపిస్తుంది. జపాన్‌కి చెందిన డాయ్‌సుకె హొరి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇతగాడు గత పన్నెండేళ్లుగా రోజుకి కేవలం అరగంట మాత్రమే నిద్రపోతున్నాడట.

స్థానిక ‘షార్ట్‌ స్లీపర్‌ అసోసియేషన్‌ (తక్కువగా నిద్రపోయే సంఘం)’కి ఛైర్మన్‌ అయిన హొరి ఎన్నో ఏళ్లుగా తన నిద్రా సమయాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ చివరికి అరగంటకు తెచ్చాడట. అయినా ఏ ఆరోగ్య సమస్యలూ లేవట.

‘మన జీవితంలో చాలా సమయం నిద్రకే వృథా అవుతోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికే మా సంఘంలోని సభ్యులు ప్రయత్నిస్తుంటారు’ అంటాడు హొరి. ‘ఇతడు నిజమే చెబుతున్నాడా’ అని తెలుసుకోవడానికి ఓ టీవీ ఛానెల్‌ మూడు రోజుల పాటు అతడి దినచర్యను షూట్‌ చేసింది కూడా.