పాన్ కార్డుతో పర్సనల్‌ లోన్ తీసుకోండిలా?

0
98

ప్రస్తుత కాలంలో కొన్ని డాక్యుమెంట్స్ లేనిది ఎటువంటి పని జరగదు. అలాంటి వాటిలో పాన్ కార్డు కూడా ఒకటి.  ప్రభుత్వ పథకాల పనుల నుంచి చిన్న చిన్న పనుల వరకు జరగాలంటే పాన్ కార్డు కూడా పాత్ర పోషిస్తుంది. 18 సంవత్సరాల వయస్సు తర్వాత పాన్ కార్డును తయారు చేయడం చాలా ముఖ్యం.

మనము జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కుంటుంటాము. చాలామందికి  కొన్ని పరిస్థితులలో అకస్మాత్తుగా డబ్బు అవసరం ఉంటుంది. ఇలాంటప్పుడు డబ్బు పొందడానికి పర్సనల్ లోన్ ఒక గొప్ప, సులభమైన మార్గంగా చెప్పుకోవచ్చు. రూ. 50,000 వరకు రుణాలకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా బ్యాంకులు ఎటువంటి భద్రత లేకుండా పాన్ కార్డ్‌పై మాత్రమే రూ. 50,000 వరకు వ్యక్తిగత రుణాలను ఇస్తాయి.

మీరు ఏది తాకట్టు పెట్టకుండా పాన్ కార్డ్, మంచి CIBIL స్కోర్ ఆధారంగా మాత్రమే బ్యాంకు నుండి వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు.  మీరు ఎటువంటి అవాంతరాలు లేకుండా మీ అవసరానికి అనుగుణంగా ఈ డబ్బును సులభంగా ఖర్చు చేయవచ్చు. వ్యక్తిగత ఖర్చులకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.