ఎస్ ఐ వివాహం 24 గంటల్లో కేసు నమోదు చేసిన పోలీసులు

ఎస్ ఐ వివాహం 24 గంటల్లో కేసు నమోదు చేసిన పోలీసులు

0
87

ఈ లాక్ డౌన్ వేళ పోలీసులు కూడా ఎక్కడైనా వివాహాలు జరుగుతుంటే అక్కడ తక్కువ మందిని మాత్రమే పిలిచి వివాహం చేసుకోండి అని చెబుతున్నారు, ప్రభుత్వ నిబంధనలు మీరితే కేసులు పెడతాము అని ముందు చెప్పారు, అయితే కొందరు ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన రీతిన వివాహాలు చేసుకుంటున్నారు.

తాజాగా సామాన్యులే కాదు ఓ ఎస్ ఐ కూడా ఇలాంటి పనే చేశాడు..ఎస్ఐ వివాహానికి హాజరైన 200 మందిపై నాగర్కోయిల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నియకుమారి జిల్లా ఈత్తమొళికి యువకుడు చెన్నైలో ఎస్ఐ పనిచేస్తున్నాడు. ఆయనకు సర్కల్విలై గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది.

ఇక బంధువులు స్నేహితులు చాలా మంది వచ్చారు భౌతిక దూరం పాటించలేదు కొందరు మాస్క్ పెట్టుకోలేదు.
వధూవరుల సహా వారిని వట్టవిలై ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించి కరోనా వైద్యపరీక్షలు నిర్వహించారు..ఇక వివాహాలు చేసుకుంటే సర్కారు అనుమతి తీసుకోవాలి అని చెప్పారు.