సీపీజీఈటీ 2021 వెబ్‌ ఆప్షన్ల ఎంపిక ఎప్పటినుండి అంటే?

Since when is the choice of CPGET 2021 web options?

0
104

తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2021 వెబ్‌ ఆప్షన్ల ఎంపికను ఈ నెల 29వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. సీపీజీఈటీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శనివారంతో ముగిసిందని చెప్పారు.

అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సోమవారంలోగా అప్‌లోడ్‌ చేయాలన్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్‌ పరిశీలన విజయవంతంగా పూర్తయిన వారి జాబితాను ఈ నెల 26వ తేదీన ప్రకటిస్తామన్నారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని 27, 28 తేదీలలో స్వీకరిస్తామని చెప్పారు.

29వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లను ఎంపికచేసుకోవచ్చని పేర్కొన్నారు.
వెబ్‌ ఆప్షన్ల ఎంపికను మార్చుకునేందుకు వచ్చే నెల 3వ తేదీ సాయంత్రం అయిదు గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. మొదటి దశ సీట్ల కేటాయింపు జాబితాను వచ్చే నెల 6వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు