Big Breaking: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల

0
107

ఈ నెల 4వ తేదీన సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా వారం కాకముందే ఈ పరీక్ష ఫలితాలను ప్రకటించారు అధికారులు. నేడు ఈ ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్‌, సింగరేణి డైరెక్టర్ విడుదల చేశారు. సింగరేణి వెబ్‌సైట్‌ www.scclmines.com లో అర్హత సాధించిన అభ్యర్థుల లిస్ట్​ ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలో 3 మార్కులు అందరికి కలిపినట్లు అధికారులు తెలిపారు.