కొందరు దుర్మార్గులు మహిళలపై దారుణాలకు ఒడిగడతారు, అత్యంత దారుణంగా వారిని హింసిస్తారు, మరికొందరు ఏకంగా వారిపై అఘాయిత్యాలకు పాల్పడతారు.ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఫలితంగా అతడు జైలు పాలయ్యాడు.
దీంతో ఆమె అన్న తన చెల్లి మరణం తట్టుకోలేకపోయాడు… తన చెల్లి మరణానికి కారణమైన వ్యక్తిని హతమార్చాలనే నిర్ణయానికి వచ్చాడు.. ఈ క్రమంలోనే ఓ హత్య కేసులో తీహార్ జైలుకెళ్లాడు. జైలులోని నంబరు 8లో తన చెల్లి ఆత్మహత్యకు కారణం అయిన మహతాబ్ ఉన్నాడని జకీర్ తెలుసుకున్నాడు.
అతడిని ఏలాగైనా అంతమొందించేందుకు పథకం వేశాడు. తన తోటి ఖైదీలు ఇబ్బంది పెడుతున్నారని.. తనను నంబరు 4 నుంచి మార్చాలని పోలీసులను కోరాడు. దీంతో జకీర్ తాను అనుకున్నట్టుగానే మహతాబ్ ఉండే 8వ నంబరుకు బదిలీ అయ్యాడు. అతనిని చూసి కోపంతో వెంటనే ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో మహతాబ్‌ను కసితీరా పొడిచి చంపేశాడు.