చెల్లిని రేప్ చేసిన అన్న‌య్య కార‌ణం అడిగితే పోలీసుల‌కు ఏం చెప్పాడంటే

చెల్లిని రేప్ చేసిన అన్న‌య్య కార‌ణం అడిగితే పోలీసుల‌కు ఏం చెప్పాడంటే

0
90

ఈ మ‌ధ్య కొంద‌రు వావి వ‌ర‌స‌లు మ‌ర్చిపోతున్నారు, తాజాగా ఓ యువ‌కుడు త‌న సొంత చెల్లిపైనే అత్యాచారం చేసి ఆమెని బెదిరించాడు, ఆమె వ‌య‌సు 15 ఏళ్లు లుధియానాలోని 10 వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది, ఈ స‌మ‌యంలో ఆమెపై ఓరోజు ఆమె అన్న అత్యాచారం చేశాడు, ఈ విష‌యం ఎవ‌రికి చెప్ప‌ద్దు అని నిన్ను చంపేస్తా అని బెదిరించాడు.

దీంతో ఆమె ఎవ‌రికి చెప్ప‌లేదు.. ఈ లాక్ డౌన్ వేళ ఉద‌యం ఆమెకి క‌డుపు నొప్పి రావ‌డంతో ఆస్ప‌త్రికి తీసుకువెళితే ఆమెకి నాలుగో నెల అని చెప్పారు వైద్యులు.. దీంతో షాక్ అయ్యారు త‌ల్లిదండ్రులు, ఆమెని ప్ర‌శ్నించారు, ఆమె మాత్రం ఏడుస్తూ ఆమె అన్న‌య్య‌ని చూపించింది.

దీంతో అత‌ని విష‌యం స్ధానికుల ద్వారా పోలీసుల‌కు తెలిసింది, ఆ వ్య‌క్తి వ‌య‌సు 22 ఏళ్లు, ఆమె అన్న‌ని పోలీసులు అరెస్ట్ చేశారు, అయితే పోర్న్ వీడియోల‌కు బానిస అయి ఇలాంటి ప‌ని చేశాను అని చెప్పాడు.. దీంతో అత‌ని పై కేసులు న‌మోదు చేశారు, ఈ విష‌యం పై పోలీసులు సీరియ‌స్ వార్నింగ్ ఇస్తున్నారు, పోర్న్ వీడియోలు చూడ‌ద్దు అని కూడా యువ‌త‌కు తెలియ‌చేస్తున్నారు.