ఈ స్కూల్ లో చేరితే విద్యార్ధులకి స్మార్ట్ ఫోన్ ఫ్రీ – ఎక్కడంటే

ఈ స్కూల్ లో చేరితే విద్యార్ధులకి స్మార్ట్ ఫోన్ ఫ్రీ - ఎక్కడంటే

0
86

ఈ కరోనా లాక్ డౌన్ వల్ల దాదాపు మార్చి నుంచి స్కూళ్లు కాలేజీలు లేవు, దీంతో విద్యార్దులు ఇంటిలోనే ఉంటున్నారు, ఇక డిజిటల్ క్లాసులు కొన్ని స్కూళ్లు స్టార్ట్ చేశాయి, అయితే జూన్ నుంచి ప్రారంభం అవ్వాల్సిన అకడమిక్ క్యాలెండర్ ఇప్పుడు ఇంకా లేట్ అయ్యేలా ఉంది.

ఇక స్కూళ్ తొలిరోజు కొత్త పుస్తకాలు బ్యాగ్ ఇలా అన్నీటితో విద్యార్దులు వెళుతూ ఉంటారు. ఇక స్కూళ్లు కాలేజీలు ఆఫర్లు ఇస్తాయి, బుక్స్ ఫ్రీ అంటాయి, అలాగే ట్యూషన్ ఫీ లో కన్ సెక్షన్ ఇస్తాయి ఇవన్నీ అడ్మిషన్ల కోసం, కాని ఇక్కడ ఓ గొప్ప ఆఫర్ ఇస్తోంది స్కూల్.

తమ స్కూల్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు మొబైల్ ఫోన్ ఇస్తామని ప్రకటించింది. అయితే, అదేదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటే పొరపాటు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రైవేటు స్కూలు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్న టీచర్లు అందరూ కలిసి నగదు వేసుకుని ఇలా ఫోన్లు కొంటున్నారట.

ఇలా చేసి ఈ స్కూల్ భారీగా ఫీజులు వసూలు చేయడం లేదు గత ఏడాది ఫీజులే తీసుకుంటోంది….తమిళనాడు మదురైలోని తియాగరాజర్ పాఠశాల తమ స్కూల్లో చేరే 6వ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా ఫోన్లు ఇస్తామని తెలిపింది.
ఈ ఫ్లోన్ల ద్వారా ఆన్ లైన్ పాఠాలు చెబుతాము అని అంటున్నారు టీచర్లు..ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లకూ అంగీకారం తెలిపింది. దీంతో ఈ స్కూల్ టీచర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు, దాదాపు అడ్మిషన్లు బాగున్నాయట.