నాయిష్టం వచ్చింది మాట్లాడతా , నాఇష్టం వచ్చింది చేస్తా అంటే ఎవరూ ఊరుకోరు, తాజాగా అర్జిత్ అనే యువకుడు సోషల్ మీడియాలో, ఇంకా ఎన్ని రోజులు ఇలా లాక్ డౌన్, ఈ లాక్ డౌన్ పాటించలేకపోతున్నా, దీనిని ఎత్తివేయండి, నేను మా సొంత ఇంటికి వెళ్లాలి పర్మిషన్ ఇవ్వండి అని పోస్ట్ పెట్టాడు.
అక్కడితో ఆగలేదు నాలా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు, అందరం కలిసి బైక్స్ పై సొంత ప్రాంతాలకు బయలు దేరుదాం అని అన్నాడు, మొత్తానికి ఈ పోస్టు ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చూసి అది జిల్లా ఎస్పీకి పంపారు, వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు, లాక్ డౌన్ వేళ కొందరిని రెచ్చగొట్టి సరిహద్దులు దాటాలి అని ప్లాన్ వేయడం పై అతనిని అరెస్ట్ చేశారు.
అంతేకాదు ఇలా ఉన్న వారు అందరూ కలిసి ఓ వాట్సాఫ్ గ్రూప్ పెట్టుకున్నారు, ఇక అర్జిత్ అరెస్ట్ అయ్యాడు అని తెలియడంతో, అందరూ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యారు, ఊరు వెళదాం అనే ఆలోచన విరమించుకున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రాతలు రాయకండి అంటున్నారు పోలీసులు.