మానవత్వానికి ఆమె నిలువుటద్దం. సేవాగుణంలో ఆమెను మించినవారు లేరు. పొద్దున లేస్తే మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడ అన్నార్థులు, అభాగ్యులుంటే వారికి సేవచేస్తూ కనబడుతుంది. పుట్టుకతోనే కష్టాలు అనుభవించిన హిమజారెడ్డి… ఇప్పుడు ఎందరికో కష్టాలు తీర్చే అమ్మ అయింది. సేవాగుణంలో హిమజారెడ్డి హిమశిఖరం హిమాయలాలంత ఎత్తుకు ఎదిగింది.
హిమజారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె సొంత ఊరు నల్లగొండ జిల్లా. విద్యాభ్యాసం నల్లగొండ, హైదరాబాద్ లో సాగింది. నల్లగొండ టౌన్ లో ఉన్న అనాథల హాటల్ అయిన పడవ హాస్టల్ లో ఉండి చదువుకున్నారు. హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి హిమజ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
గతంలో క్యాన్స్రర్ పేషెంట్స్ కోసం జుట్టు సేకరించేందుకు తాను సైతం జుట్టు ఇచ్చి దాతలను ముందుకొచ్చేలా ముందునడిచారు. ఆమె గురించిన ఇంటర్వ్యూ Shadow Tv అనే యూట్యూబ్ ఛానెల్ లో ఉంది చూడొచ్చు. కింద ఆమెకు సంబంధించిన రెండు వీడియో లింక్స్ ఉన్నాయి. చూడొచ్చు… సాటి వారికి సాయం చేయడంలో హిమజను చూసి నేటి యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆల్ టైం రిపోర్ట్ వెబ్ సైట్ నుంచి సూచిస్తున్నాము. హిమజారెడ్డికి హ్యట్సాప్ చెబుతున్నాము.