కోడి కోసం కన్న కొడుకుని చంపిన తండ్రి…

కోడి కోసం కన్న కొడుకుని చంపిన తండ్రి...

0
89

కోడికోసం కన్న కొడుకుని తండ్రి చంపడం ఏంటని అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారా అవునండీ మీరు విన్నది నిజమే… ఎక్కడైనా ఆస్తికోసం కొడుకు తల్లిదండ్రులను, లేదా తల్లిదండ్రులు కొడుకుని హత్యచేసిన సంఘటనలు చూశాముకాని కానీ కోడి కోసం కొడుకుని హత్య చేసిన సంఘటన చూడలేదని అందరు అనుకుంటుంటారు…

కోడి కోసం కొడుకుని హత్య చేసిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది… గుమ్మాలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామంలో మదేశ్వరరావు అనే యువకుడు తన పెరట్లో ఓ కోడిని పెంచుతున్నాడు అయితే తండ్రి కాంతారావు ఆ కోడిని చెరువులోకి తీసుకువెళ్లి ముంచగా అది మృతి చెందింది…. సాయంత్రం కుమారు వచ్చి కోడి ఎక్కడ ఉందని అడగగా తండ్రి చనిపోయిందని చెప్పాడు…

దీంతో ఇందరి మధ్య ఘర్షణ జరిగింది…. మాటా మాట పెరగడంతో తండ్రి కుమారుడిని కత్తితో పొడిచాడు దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు… ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా రోడ్డు మార్గమాధ్యమంలో చనిపోయాడు… కొడుకు చనిపోయాడని తండ్రికి తెలియగానే కాంతారావు పరార్ అయ్యాడు… నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు…