ఒక్క మాటతో తల్లి తండ్రులను కలిపిన కొడుకు..

0
101

ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ మహిళా కమిషన్ కార్యాలయంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడు ఒక్క మాట కారణంగా తమ తల్లితండ్రులు జీవితాంతం కలిసి ఉండడానికి నిశ్యయించుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే.. రాయ్పూర్కు చెందిన ఇద్దరు దంపతులు చిన్న చిన్న విషయాలకే ఎప్పటికి గొడవలు పడుతుండేవారు. ఇంటి పనులు సరిగ్గ చేయదని భర్త, ఇంటి ఖర్చులు పట్టించుకోడని భార్య ఇద్దరు ఒక్కరితో ఒకరు గోడవ పడడం ఆ ఇంట్లో ఓ పనిగా మారిపోయింది.

దాంతో వీరివురు విడిపోదామని విడాకులకు అప్లై చేసి కొన్ని నెలలుగా వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. వారికీ ఇద్దరు మగ పిల్లలు ఉండగా..వారిద్దరికీ చెరొకరిని పంచుకుని జీవనం సాగిస్తున్నారు. అనంతరం విడాకుల కేసు విచారణ సందర్భంగా జంటను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కౌన్సిలింగు పిలిపించగా ఇద్దరూ కోర్టుకు వచ్చారు. తమకు ఖచ్చితంగా విడాకులు కావాలని గట్టిగా వాదించారు.

దాంతో న్యాయమూర్తి ఆ దంపతుల పెద్ద కొడుకుని పిలిచి ‘నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావు?’ అని ప్రశ్నించాడు. దానికి ఐదేళ్ల బాలుడు సమాధానం అందరిని ముగ్దుల్ని చేసింది. అతను ఆ ప్రశ్నకు ‘నేను ఇద్దరితో కలిసి ఉండాలనుకుంటున్నాన’ని అమ్మానాన్న చేతులు పట్టుకున్నాడు. దీంతో అప్పటివరకు తిట్టుకున్న ఆ భార్యాభర్తలు ఆ ఐదేళ్ల కొడుకు మాటలు విని కన్నీళ్లు పెట్టుకొని కుమారుల కోసం కలిసి జీవిస్తామని చెప్పారు. వాళ్ళతో పాటు అది విన్న స్థానికులు కూడా కంటతడి పెట్టుకున్నారు.