అసలే కరోనా సమయం పైగా ఈ సమయంలో ప్రయాణాలు వద్దు అనుకుంటున్నారు చాలా మంది. ఇక ప్రయాణాలు చేద్దాం అనుకున్నా చాలా చోట్ల లాక్ డౌన్ కర్ఫ్యూల వల్ల ఎక్కడకు వెళ్లలేని పరిస్దితి, దీంతో రైలు, బస్సుల్లో ప్రయాణికులు చాలా వరకూ తగ్గిపోయారు, ఇక ప్రయాణికుల రద్దీ లేని కారణంగా జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
మరి ఏ ఏ రైళ్లు రద్దు చేశారు అనేది ఓసారి చూద్దాం.
విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ , గుంటూరు-వికారాబాద్ , వికారాబాద్-గుంటూరు , బీదర్-హైదరాబాద్ , సికింద్రాబాద్-బీదర్ , విజయవాడ-సికింద్రాబాద్ , సికింద్రాబాద్-విజయవాడ , హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ , సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్ , కర్నూల్ సిటీ-సికింద్రాబాద్ , సికింద్రాబాద్-కర్నూల్ సిటీ , నర్సాపూర్-నిడదవోలు , నిడదవోలు-నర్సాపూర్ , గుంటూరు-కాచిగూడ , ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్ , కాచిగూడ-గుంటూరు , హెచ్.ఎస్.నాందేడ్-ఆదిలాబాద్ , ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి , పర్బని-హెచ్.ఎస్.నాందేడ్ , విజయవాడ-ఎం.జీ.ఆర్.చెన్నయ్సెంట్రల్ , తిరుపతి-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్ ఈ రైళ్లని జూన్ 1నుంచి 16 వరకు రద్దు చేస్తున్నామని రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణికులు దీనిని గమనించగలరు.