రైసా హెల్త్ ఫార్మసీని ప్రారంభించిన శ్రీ శ్రీ దేవాంత తీర్థ చిన్న జీయర్ స్వామి

0
84

హైదరాబాద్ సరూర్ నగర్ హస్తినాపురం పంచాయతీరాజ్ కాలనీలో రైసా హెల్త్ ఫార్మసీని శ్రీశ్రీ దేవాంత తీర్థ చిన్న జీయర్ స్వామి స్వహస్తాలతో ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. 2019 లో రిజిస్టర్ అయిన రైసా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థని మొదటగా రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రదేశాల్లో ప్రారంభిస్తామని ఇది మూడవ బ్రాంచ్ అని డాక్టర్స్ మాలతి, సంధ్య తెలిపారు.

ఈ స్టార్టప్ కంపెనీలో ఫార్మసలలోని ఆన్లైన్ కన్సల్టేషన్ విధానాన్ని కూడా ప్రారంభిస్తున్నామని అన్నారు. దీనిని ఏరియా చుట్టుపక్కల ఉన్న అన్ని హాస్పిటల్ కి అనుసంధానం చేస్తూ మెడికల్ సర్వీసులను అన్నింటిని ప్రైవేట్ చేయడంతో పాటు సొంతంగా ఒక వెబ్ సైట్ ను కూడా రూపొందించామని తెలిపారు.

దీని ద్వారా ప్రజలు తమకు కావాల్సిన మెడికల్ సర్వీసులను ఈజీగా పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాలతి డాక్టర్ సంధ్య నవీన్ కుమార్ రవి రాజు, శ్రీమతి హారిక కొండపర్తి, డాక్టర్ ఫ ని కాంత్ తదితరులు పాల్గొన్నారు.