చరిత్ర – శ్రీ కృష్ణుడిని శపించిన గాంధారీ చివరకు అదే నిజమైంది

చరిత్ర - శ్రీ కృష్ణుడిని శపించిన గాంధారీ చివరకు అదే నిజమైంది

0
101

మహాభారతంలో కచ్చితంగా గాంధారీ పేరు కచ్చితంగా వినిపిస్తుంది, నూరుగురు కౌరవుల తల్లి ఆమె, అయితే మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడి వంశం, ఆయన పిల్లలు, యాదవులు నశిస్తారని గాంధారి కృష్ణుడిని శపించింది. మరి ఆమె ఎందుకు శపించింది దాని వెనుక జరిగింది ఏమిటి అనేది తెలుసుకుందాం.

మహాభారత యుద్ధం ముగిసింది, కౌరవులు నశిస్తారు,గాంధారి కుమారులు అందరూ పాండవులతో కురుక్షేత్రంలో భీముడి చేతిలో జరిగిన యుద్ధంలో చంపబడ్డారు. ఈ వార్త తెలిసి ఆమె రోధిస్తుంది, తన బిడ్డలు లేరు అని కన్నీరు పెడుతుంది.

ఈ సమయంలో తన కళ్ళకు కట్టిన గంతలకు ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఆమె చూపు యుధిష్ఠరుడి బొటనవేలు మీద పడుతుంది, ఆమె కోపం శక్తి కారణంగా అతని శుభ్రమైన బొటనవేలు నల్లగా మారిందని చెబుతారు. ఇక పాండవులు గెలిచిన వార్త విని ఆమె వివాదాలు మరిచి ఉప పాండవులని ఆలింగనం చేసుకుంటుంది.

ఈ విధ్వంసం జరగడానికి కారణమైన కృష్ణుడి వైపు ఆమె కోపంగా చూస్తుంది….శ్రీకృష్ణుడు, అతని నగరం, అతని ప్రజలందరూ నాశనం అవుతారని ఆమె శపించింది. కృష్ణుడు శాపమును అంగీకరించాడు. మహాభారత యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తరువాత ఆమె శాపం నిజమైంది అంటారు, ఒక పండుగలో యాదవుల మధ్య పోరాటం జరిగి యదు రాజవంశం నశించిపోయింది.

తర్వాత శ్రీకృష్ణుడు 126 సంవత్సరాలు జీవించిన తరువాత తన లోకానికి వెళ్ళిపోయాడు. అతను కనిపించకుండా పోయిన ఏడు రోజుల తరువాత బంగారు ద్వారకా నగరం మునిగిపోయింది. ఇలా ఆమె శాపం నిజమైంది అంటారు చరిత్రలో.