SSC Exam క్యాలెండర్ విడుదల..ఏ పరీక్ష ఎప్పుడు ఉందో తెలుసా?

SSC Exam Calendar Release.. Find out when any exam is available

0
115

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) టైర్ I, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) కోసం 2021-22 పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. SSC CGL, CHSL, MTS, స్టెనోగ్రాఫర్ C & D, GD కానిస్టేబుల్, ఇతర పరీక్షల కోసం నోటిఫికేషన్‌లు, పరీక్ష తేదీలు మొదలైనవి గతంలోనే విడుదల అయ్యాయి.

SSC పరీక్షల క్యాలెండర్ 2021-22 కొన్ని పెండింగ్‌లో ఉన్న 2021 పరీక్షలు, కొన్ని రాబోయే 2022 పరీక్షల తేదీలను పేర్కొంది. SSC CGL టైర్ I పరీక్ష 2021 కోసం నమోదు ప్రక్రియ డిసెంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది.

SSC CHSL టైర్ I పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 1, 2022 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని పరీక్ష తేదీలు 2022-23కి సంబంధించినవి. ఈ తేదీలు తాత్కాలికమైనవి, ఎప్పుడైనా మారవచ్చని అభ్యర్థులు గమనించాలి. ఏవైనా మార్పులు జరిగితే SSC అందరికీ తెలియజేస్తూ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. అభ్యర్థులు ఇప్పుడు పూర్తి షెడ్యూల్ లేదా తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ను అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో తనిఖీ చేయవచ్చు.

SSC CGL (SSC GCL) పరీక్ష నోటిఫికేషన్ 23 డిసెంబర్ 2021న జారీ చేస్తారు. దరఖాస్తులు జనవరి 23 వరకు తీసుకుంటారు. పరీక్ష ఏప్రిల్ 2022లో జరుగుతుంది. SSC CHSL (SSC GCL) (10+2) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 1, 2022న విడుదల అవుతుంది. దరఖాస్తులు 7 మార్చి 2022 వరకు తీసుకుంటారు. పరీక్ష మే 2022లో జరుగుతుంది. SSC MTS (నాన్-టెక్నికల్) రిక్రూట్‌మెంట్ పరీక్ష నోటిఫికేషన్ 22 మార్చి 2022న జారీ చేస్తారు. దరఖాస్తులు 30 ఏప్రిల్ 2022 వరకు తీసుకుంటారు. పరీక్ష జూన్ 2022లో జరుగుతుంది.

SSC ఎంపిక పోస్టులు10వ దశ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 10 మే 2022న విడుదల చేస్తారు. దరఖాస్తులు 9 జూన్ 2022 వరకు తీసుకుంటారు. పరీక్ష జూలై 2022లో జరుగుతుంది. ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నోటిఫికేషన్ 17 మే 2022న జారీ చేస్తారు. పరీక్ష సెప్టెంబర్ 2022లో జరుగుతుంది. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) రిక్రూట్‌మెంట్ పరీక్ష నోటిఫికేషన్ 27 జూన్ 2022న విడుదల చేస్తారు. పరీక్ష అక్టోబర్ 2022లో జరుగుతుంది.