
ఎస్‌ఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెల్లింది. ఏపీలోని తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు దీన్ని ప్రయోగించారు. ఈ వాహకనౌక ఈవోఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌకను ఇవాళ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.




