విద్యార్థిపై టీచర్ లైంగిక దాడి…

విద్యార్థిపై టీచర్ లైంగిక దాడి...

0
97

తెలంగాణలో దిశ సంఘటన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు రక్షణగా దిశ యాక్ట్ కు తీసుకువచ్చారు… మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడినా ఈ చట్టం కింది కఠిన చర్యలు తప్పవు…

అయితే ఈ చట్టాలు తమకు వర్తించవన్నట్లు ప్రవిర్తిస్తున్నారు కామాంధులు తాజాగా పొన్నురులో దారుణం జరిగింది… విద్యార్థిని ఉన్నత స్థాయిలో తీర్చి దిద్దాల్సిన ఉపాద్యాయుడు తన వక్ర బుద్దిని బయట పెట్టారు… జెడ్పీ స్కూల్ లో చదువుతున్న విద్యార్థిని స్టాఫ్ రూమ్ లోకి పిలిపించుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు…

ఈ విషయం విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉపాద్యాయుడు వీరభద్రయ్యను అదుపులోకి తీసుకున్నారు…