తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం వేసవి సెలవులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో విద్యారులు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని ఏప్రిల్ 24 వ తేదీ అంటే రేపటి నుంచి జూన్ 12వ తేదీ వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. మళ్ళి నూతన విద్య సంవత్సరం జూన్ 13 ప్రారంభం కానుంది.
ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో వారికీ మాత్రమే వేసవి సెలవులు ప్రకటించారు. మే 23 వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మే 6 తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. అనంతరం ఇంటర్ సెకండియర్ పరీక్షలు మే 7 తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి.