నెలకి రూ.10,000 పొందే సూపర్ స్కీమ్..పూర్తి వివరాలివే?

0
113

కరోనా సంక్షోభంతో ప్రజలు స్కీమ్స్ లో డబ్బులు పెట్టడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఈ మధ్య కాలంలో ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెట్టి అధిక లాభాలు రాబడుతున్నారు. యాన్యుటీ డిపాజిట్ స్కీమ్స్ లో చేరితే అధిక రాబడి పొందడం ఖాయం అంటున్నారు అధికారులు. అంతేకాకుండా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

పూర్తి వివరాలు మీ కోసం..

ఈ స్కీమ్ లో మీరు 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలలకు మీ డబ్బుల్ని డిపాజిట్ చేయొచ్చు. ఈ స్కీమ్ అకౌంట్ ని ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సింగిల్‌గా లేదా జాయింట్‌గా అకౌంట్ ను కూడా ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. కనీసం రూ.1,000 నుంచి ప్రతీ నెలా ఆదాయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది.

మీరు డబ్బులు ఈ నెలలో ఏ తేదీన కడితే మళ్ళీ నెల అదే తేదీన మీకు వడ్డీ వస్తుంది. ఒకవేళ అకౌంట్ హోల్డర్ అనుకోకుండా మరణిస్తే డబ్బులు నామినీకి లభిస్తాయి. ప్రతీ నెలా రూ.10,000 చొప్పున అకౌంట్‌లో జమ అవుతుంది. అందుకే వెంటనే ఈ స్కీమ్ లో అకౌంట్ ఓపెన్ చేసి తక్కువ ఇంట్రెస్ట్ తో ఎక్కువ రాబడి పొందండి.