ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కంగారు పుట్టిస్తోంది… ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది… మనుషుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి కానీ కరోనా మాత్రం అందరిని సమానంగా చూస్తుంది… ఈ మహమ్మారి రాజకీయ నాయకులను అలాగే సెలబ్రిటీలను సైతం వదలకుంది…
తాజాగా అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది… ఇద్దరు దంపతులు కరోనా వచ్చిందని మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు… ధర్మవరంకు చెందిన ఫనిరాజ్ శిరీష దంపతులు…వీరికి కరోనా పాజిటివ్ రావడంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి దీంతో వారు మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు…
కాగా వారం రోజుల క్రితం ఫనిరాజ్ తల్లికి కరోనా పాజిటివ్ వచ్చింది… ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఇటీవలే మృతి చెందింది… ఆమె మృతి చెంది వారం రోజులు గడవక ముందే అదే ఇంట్లోను దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు…