స్వీట్ అనుకుని బాంబ్ కొరికిన పిల్లాడు ? చివరకు దారుణం

స్వీట్ అనుకుని బాంబ్ కొరికిన పిల్లాడు ? చివరకు దారుణం

0
141

చిన్న పిల్లలు ఏం చేసినా వారికి తెలిసీ తెలియని వయసు …అందుకే వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎక్కడ సింగిల్ గా వదిలెయ్యకూడదు, ఇక పెద్దలు వారిపై ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, అయితే ఓ చిన్నారి చేపల వేటకు వాడే జిలెటిన్ స్టిక్ను కొరికాడు చివరకు అది పేలడంతో..

ఆరేళ్ల బాలుడు నెత్తురోడుతూ అక్కడికక్కడే చనిపోయాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా అలగారై గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. అక్కడ కావేరీ నదిలో చేపలు పట్టేందుకు జిలెటిన్ స్టిక్స్ తయారు చేస్తున్నారు, ఇక తయారైన బాంబ్ ఓ వ్యక్తి ఇంటిలో జాగ్రత్తగా పెట్టారు.

కాని ఆ వ్యక్తి కుమారుడు దానిని స్వీట్ అనుకుని పంటితో కొరికాడు.. అది బాలుడి నోట్లోనే పేలిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. చివరకు కేసు అవుతుంది అని రాత్రికి రాత్రి అంత్యక్రియలు చేశారు, చివరకు గ్రామస్తులు పోలీసులకు విషయం చెప్పడంతో కేసు నమోదు చేశారు.