మనం ఇప్పటి వరకూ స్వీట్ షాపుకి వెళ్లిన సమయంలో అక్కడ డిస్ ప్లే లో కనిపించిన స్వీట్లు తీసుకునేవాళ్లం, కాని ఆ స్వీట్ లు అసలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎప్పటి వరకూ వాటిని తినవచ్చు అనేది మాత్రం తెలిసేది కాదు.. దీని వల్ల చాలా వరకూ డేట్ అయిపోయినవి స్వీట్లు కూడా కొందరు అమ్మేవారు వ్యాపారులు.
కాని ఇప్పుడు ఇక కుదరదు.ఇకపై ఆ స్వీట్లకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి స్వీట్ షాపులో అమ్మే స్వీట్లకు బెస్ట్ బిఫోర్ డేట్ తప్పనిసరిగా వెల్లడించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశించింది.
ఇక మీరు ఏ స్వీట్ కొనుక్కున్నా లూజ్ స్వీట్ తీసుకున్నా అది ఎప్పటి వరకూ ఉంటుందో కచ్చితంగా తెలపాలి, కచ్చితంగా స్వీట్ కొనే సమయంలో బెస్ట్ బిఫోర్ డేట్ చూసి తీసుకోండి.