శ్రీవారి భక్తులకు తీపి కబురు..టీటీడీ కీలక నిర్ణయం

Sweet talk for Srivari devotees..TTD is a key decision

0
109

కొత్త ఏడాదిలో శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పనుంది. సంక్రాంతి తర్వాత దర్శన టికెట్లు పెంచుతామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల తితిదే పాలకమండలి నిర్ణయాలను వెల్లడించిన ఆయన..ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించామన్నారు.

అలాగే ఈ సమావేశంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై చర్చించామని.., గతేడాది మాదిరిగానే 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు వైవీ స్పష్టం చేశారు. పద్మావతి పిల్లల ఆస్పత్రి నిర్మించటంతో పాటు అన్నమయ్య మార్గంలో రోడ్డు, నడక దారి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

అన్నమయ్య ప్రాజెక్టు వల్ల దెబ్బతిన్న ఆలయాలు పునరుద్ధరణ, శ్రీశైలంలో ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయిస్తామని తితిదే చైర్మన్ స్పష్టం చేశారు. ఎఫ్ఎంఎస్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేశామని తెలిపారు.