తెలంగాణలో దిశ ఘటన మరువక ముందే మరో దారుణం

తెలంగాణలో దిశ ఘటన మరువక ముందే మరో దారుణం

0
108

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా కామంధుల్లో ఎలాంటి మార్పు రాకుండా ఉంది… ఈ చట్టాలు తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు… దిశ హత్య మరువక ముందే తెలంగాణలో మరో దారుణం జరిగింది… హైదరాబాద్ నారాయణగూడకు చెందిన పదవ తరగతి చదువుతున్న యువతికి స్థానికింగా ఉన్న ఓ యువకుడు పరిచయం అయ్యాడు…

ఆ యువకుడు ఐటీఐ చదువుతున్నాడు… ఈ క్రమంలో బర్త్ డే పార్టీ ఉందని చెప్పి ఆమెను తీసుకువెళ్లాడు… తమ కూతురుకనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… దీంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు… తెల్లవారు జామున కూతురు ఇంటికి చేరుకుంది…

ఏం జరిగిందని అడిగారు కానీ చెప్పలేదు… దీంతో పోలీసులు భరోసా కేంద్రానికి తరలించారు.. అక్కడ కౌన్సిలర్లు మాట్లాడగా అసలు విషయం బయటపెట్టింది… తనను రోహన్ అనే యువకుడు మనస్థలిపురం సమీపంలోని ఇంజాపూర్ గ్రామం సాహెబ్ నగర్ కు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని చెప్పింది… దీంతో రోహన్ ను పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు..