కొన్ని సంఘటనలు కన్నీరు తెప్పిస్తుంటాయి… అలాంటి సంఘటనే ఇది… కరోనా మృత దేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి.. ఇటీవలే న్యాయస్థానాలు సంప్రదాయ పద్దతిలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేయాలని చెప్పినా కూడా సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు… ఇటీవలే తిరుపతిలో కూరగాయల మార్కెట్ లో పని చేస్తున్న ఒక వ్యక్తికి కరోనా సోకడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు…
మృత దేహాన్ని ఆంబులెన్స్ లో తీసుకువెళ్లారు… అయితే మృత దేహం ఎక్కువ బరువు ఉందని చెప్పి జేసీబీ ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేశారు… ఈ సంఘటన ప్రజలు మరువక ముందే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది… హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో కరోనాతో చికిత్స పొందిన వారి మృత దేహాలను ఈ ఎస్ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికలో దహనం చేస్తున్నారు…
అయితే అక్కడ పూర్తిగా కాలని మృత దేహాలను కుక్కలు పీక్కుతింటున్న దృష్యాలు బయటకు వచ్చాయి… చనిపోయిన వివరాలు నమోదు చేయడంతో అంత్యక్రియలను జీహెచ్ ఎంసీ పర్యవేక్షిస్తోంది… ఇందుకోసం శ్మశాన వాటికలో సిబ్బంది కూడా నియమించింది… కానీ కరోనా పేషెంట్ల మృతదేహాలు సరిగా కాలకపోయినా సిబ్బంది పట్టించుకోవడం లేదు… మృత దేహాన్ని కుక్కలు పిక్కుతింటున్న శవాన్ని చూసి ఒక వ్యక్తి సిబ్బందిని ప్రశ్నించాడు… అయితే అది మాబాధ్యత కాదని సిబ్బంది చెబుతున్నారు…