BIG BREAKING: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

0
195

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ నెల 2న ఆమె అస్వస్థతకు గురికావడంతో బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత ఆరోగ్యం మెరుగుపడటంతో వెంటిలేటర్‌ తొలగించి సాధారణ గదికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి శుక్రవారం మళ్లీ ఆందోళనకరంగా మారడంతో ఐసీయూకు తరలించారు. నేడు ఆమె ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.