తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

0
95

తెలంగాణలోని పలు గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి అడ్మిషన్ల కోసం మే 8న పరీక్ష నిర్వహించారు. నాలుగు సొసైటీలకు కలిపి మొత్తం 48,440 సీట్లుండగా..1,47,924 విద్యార్థులు అప్లై చేసుుకున్నారు. అందులో 1,38,000 మంది పరీక్షకు హాజరయ్యారు. గతేడాది ఈ సంఖ్య కేవలం 87,773 మాత్రమే కావడం గమనార్హం.

తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సొసైటీలకు సంబంధించిన ఫలితాలను రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి కొప్పులు ఈ శ్వర్ రిలీజ్ చేశారు. ఫలితాల కోసం https://tgcet.cgg.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. గురుకులాల్లో ఇంగ్లీషు మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తుండడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ పాఠశాలల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు.