తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యా సంస్థలన్నింటికీ సెలవులు పొడిగించిన నేపథ్యంలో పరీక్షలన్నీ వాయిదా వేయాలని విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు విశ్వవిద్యాలయాలు వెల్లడించాయి.సెలవుల్లో పరీక్షలను నిర్వహిస్తే.. వాటిని పరిగణనలోకి తీసుకోబోమని ప్రైవేట్ కళాశాలలకు జేఎన్టీయూహెచ్ స్పష్టం చేసింది.
తెలంగాణ విద్యార్థులారా అలర్ట్..ఆ పరీక్షలన్ని వాయిదా..స్పష్టం చేసిన జేఎన్టీయూహెచ్
Telangana students alert .. postpone all the exams!