తెలంగాణ: కామారెడ్డి, ములుగు జిల్లాల్లో చిరుత టెన్షన్ నెలకొంది. ఏజెన్సీ గ్రామాలను వణికిస్తోంది పెద్దపులి. రోజుకో ప్రాంతంలో అడవుల్లో మేతకెళ్తున్న పశువులపై దాడి చేసి బలి తీసుకుంటోంది. తెలంగాణలో పులుల సంచారం నానాటికి పెరుగుతున్నాయి. జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో చోట పశువుల మందపై, పశువుల కాపరులపై దాడి చేస్తూ జనాలకు, అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పులుల సంచారం కారణంగా పలు జిల్లాల్లో ప్రజలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల గ్రామంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ప్రధాన రహదారిపై దర్జాగా సంచరిస్తూ గ్రామస్తుల కంట పడింది పెద్దపులి. దానిని చూసిన ప్రజలు బెంబేలెత్తిపోయారు.
మెట్టుగూడెం అడవుల్లో ఓ ఆవు, 4 లేగదూడలను చంపేసింది. పులి సంచారంతో ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు పశువుల కాపరులు. ఇటు కామారెడ్డి లింగంపేట మండలం అయ్యపల్లిలో చిరుత సంచారం భయపెడుతోంది. స్థానికులిచ్చిన సమాచారంతో వాటికి పట్టుకునేందుకు రంగంలోకి దిగారు అటవీశాఖాధికారులు.