Flash News: తెలంగాణ టెన్త్‌ సప్లి ఫలితాలు రిలీజ్..చెక్ చేసుకోండిలా..

0
117

తెలంగాణాలో 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.సైఫాబాద్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 55,652 మంది విద్యార్థులు హాజరవ్వగా వీరికోసం 204 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

తాజాగా విడుదల చేసిన సప్లిమెంటరీ ఫలితాల్లో మొత్తం మంది 79.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 48,167 మంది హాజరుకాగా 38,447 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత 82.21 శాతం కాగా, బాలురు 78.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను http://www.bse.telangana.gov.in చెక్‌ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. కాగా ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించిన విషయం విధితమే.