చూసింది ప్రతీదీ నమ్మలేము విన్నదీ ప్రతీదీ నమ్మలేము, ఈ రోజుల్లో ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు.. ఎవరి వక్ర బుద్ది ఏమిటి ఎవరి నిజ స్వరూపం ఏమిటి అనేది ఎవరికి తెలియడం లేదు.. వారిలోని ఆ కోణం కాస్త ఆలస్యంగా బయటపడుతోంది. కాని ఈలోపు మనం వారికి అన్నీ విషయాలు షేర్ చేసుకుంటాం…ఇలాంటి చాలా కేసులు ఘటనలు మనం వింటూనే ఉన్నాం..
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తో స్నేహితుడిలా నటిస్తూ… నగ్న చిత్రాలను పంపాలంటూ బంధువును వేధించాడు ఓ యువకుడు చివరకు తెలిసిన వ్యక్తే ఇదంతా చేస్తున్నాడు అని తెలిసి ఆమె షాక్ అయింది. సాయి అనే వ్యక్తి బంధువు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తోంది, ఆమె సోషల్ మీడియా అకౌంట్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు ..ఆమె తెలిసిన వ్యక్తి అని యాక్సెప్ట్ చేసింది. కొద్ది రోజుల తర్వాత తన వక్రబుద్ధి బయటపెట్టాడు.
ఆ అకౌంట్ కు వేరే కొత్త అకౌంట్ అమ్మాయి పేరుతో క్రియేట్ చేసి రక్వెస్ట్ పంపాడు.. ఆమె అమ్మాయి కదా అని ఒకే చేసింది..అయితే కొద్ది రోజులకి నీ న్యూడ్ పిక్స్ పంపు అని మెసేజ్ లు.. దీంతో ఆమె విరక్తి చెంది సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేసింది… దీంతో అన్నీ ఆధారాలు సేకరించి ఆ వ్యక్తిని పట్టుకుంటే తెలిసిన వ్యక్తే ఇదంతా చేస్తున్నాడు అని తెలిసి షాక్ అయింది. మీకు తెలియని వారి నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తే యాక్సెప్ట్ చేయద్దు అంటున్నారు నిపుణులు పోలీసులు.
.