తేలు కుట్టినట్లు కల వస్తే… ఏం జరుగుతుంది దాని అర్ధం

తేలు కుట్టినట్లు కల వస్తే... ఏం జరుగుతుంది దాని అర్ధం

0
150

చాలా మందికి నిద్రలో కలలు వస్తూ ఉంటాయి, అయితే ఒక్కోసారి భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి, మరీ ముఖ్యంగా నిద్రలో తెల్లవారుజామున వచ్చిన కలలు నిజం అవుతాయి అని చాలా మంది నమ్ముతూ ఉంటారు, అయితే అసలు నిజంగా ఇలా కలలు వచ్చిన సమయంలో ఇవి నిజం అవుతాయా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది.

ఇక చాలా మందికి పాము కుట్టినట్లు తేలు కుట్టినట్టు కలలు వస్తూ ఉంటాయి, ఇక విషపు జంతువులు కాబట్టి ఎంతో భయం కూడా ఉంటుంది. అయితే ఇలా తేలు కుట్టినట్టు కల వస్తే మీరు వ్యాపారం చేస్తుంటేఅందులో ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది అని గమనించాలి ,అలాగే ఉద్యోగం అయితే అక్కడ మీ తోటి వారితోనే మీకు ఏదొ ప్రమాదం ఉంది అని గ్రహించాలి.

బతుకు భారంగా మారితే… అలాంటి సమయంలో తేలు కుట్టిన కల వస్తూ ఉంటుంది. ఇక మీరు ఎంతో అభిమానించే వారు మీకు ఏదో చేసి ఉంటారు అని భావించాలి.. అంటే మీకు ద్రోహం లేదా చెడు తలపెట్టే కార్యం అని గ్రహించాలట,సవాళ్లు ముందున్నాయని కూడా అర్థం ఉంటుంది. కాని ఇలాంటి ప్రమాదం ఏదీ ఉండకూడదు అని అనుకుంటే మీ ఇష్ట దైవాన్ని ఉదయాన్నే తలచుకుంటే సరిపోతుంది అంటున్నారు.