టెన్త్‌- ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు..నెలకు రూ.70 వేల జీతం

0
86

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌.. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం ఇలా..

ఖాళీల సంఖ్య: 253

ఖాళీల వివరాలు:

అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌

వెల్డర్‌

ఆఫీస్‌ అసిస్టెంట్‌

స్ట్రక్చరల్‌ ఫిట్టర్‌

ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌

టెక్నికల్‌ అసిస్టెంట్‌

ట్రైనీ వెల్డర్‌

యార్డ్‌ అసిస్టెంట్‌

సివిల్ అసిస్టెంట్‌

అన్‌స్కిల్డ్‌

వయోపరిమితి: ఫిబ్రవరి 28, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 36 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.10,100ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 28, 2022.

హార్డ్‌ కాపీలను పంపడానికి చివరి తేదీ: మే 9, 2022.

అడ్రస్‌: సీజీఎం, హెచ్‌ఆర్‌ విభాగం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భవన్‌, గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌, వాస్కోడాగామా, గోవా- 403802.