టెన్త్ అర్హతతో పోస్టాఫీస్ లో ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..

0
108

మీరు టెన్త్ పాస్ అయ్యారా? అయితే మీకు సదావకాశం. పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్ లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ముంబయిలోని ఇండియా పోస్ట్‌ స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖాళీల సంఖ్య: 24

పోస్టుల వివరాలు: స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ పోస్టులు

వయస్సు: అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించరాదు.

జీతం: నెలకు రూ.19,900లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి.

అడ్రస్‌: The Senior Manager (JAG), Mail Motor Service, No. 37, Greams Road, Chennai- 600006.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20, 2022.