తాళికట్టిన గంటకే గర్భవతి అని తేలింది పెళ్లి కొడుకు ఏం చేశాడంటే

తాళికట్టిన గంటకే గర్భవతి అని తేలింది పెళ్లి కొడుకు ఏం చేశాడంటే

0
99

అమ్మాయి మంచిది గుణవతి అని తెలియడంతో పెళ్లికి అబ్బాయి కుటుంబం ఒప్పుకుంది, వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టించి పందిరి వేసి బాజాలు మోగించారు.. పెళ్లికి వచ్చిన బంధువులు అంతా చూడచక్కని జంట అని అన్నారు…ఈ సమయంలో ఒక్కసారిగా పెళ్లికూతురు కళ్లు తిరిగిపడిపోయింది.పెళ్లికి వచ్చిన ఓ డాక్టర్ ఆమెను పరీక్షించి ఐదు నెలల గర్భవతి అని చెప్పడంతో అంతా షాకయ్యారు. ఈ వింతైన ఘటన పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది.

బీర్బుమ్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి అదే గ్రామానికి చెందిన సురేశ్ అనే యువకుడితో పెళ్లి చేసుకున్న రెండు గంటలకే ఇలా జరగడంతో అందరూ షాక్ అయ్యారు..మూడుముళ్లు వేసి గంట గడవకముందే తన భార్య గర్భవతి అని తేలడంతో వరుడు షాక్లోకి వెళ్లిపోయాడు. తమను మోసం చేసి పెళ్లి చేశారంటూ వరుడి బంధువులు పెళ్లి కుమార్తె తరఫు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పెళ్లి మండపం కాస్తా రణరంగంగా మారింది.

ఈ నిర్వాకంపై ఆరా తీయగా వధువు స్నేహితుడే ఆమెను లొంగదీసుకుని గర్భవతిని చేసినట్లు తేలింది. యువతి గర్భవతి అని తెలియగానే ఆ కామాంధుడు గ్రామం నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.
అయితే పెళ్లి కూతురు మాత్రం చాటుగా తమ వ్యవహారం సాగింది అని తనకు కూడా గర్భం వచ్చిన విషయం తెలియదు అని చెప్పింది.
స్నేహితులు ఈ విషయం మెసేజ్ చేయడంతో ఊరి నుంచి పారిపోయాడు ఆ కుర్రాడు, అయితే పెళ్లి కొడుకు మాత్రం తమకు వివాహానికి అయిన ఖర్చు మొత్తం చెల్లించాలి అని వధువు కుటుంబాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నామని లీగల్ నోటీస్ పంపించాడు ఆ వరుడు.