తన ప్రియుడితో కుమార్తెకి పెళ్లి చేయాలనుకున్న తల్లి – ఎంత దారుణం

తన ప్రియుడితో కుమార్తెకి పెళ్లి చేయాలనుకున్న తల్లి - ఎంత దారుణం

0
131

ఈ రోజుల్లో కొన్ని సంఘటనలు వింటూ ఉంటే మానవసంబంధాలు మంటగలుస్తున్నాయి అనిపిస్తుంది. ఇక ఆ క్షణిక సుఖాల కోసం ఏకంగా కుటుంబాలను వదిలేస్తున్నారు.. పిల్లలు భర్త భార్య ఇలా వారిని వదిలేసి వేరే వారితో అఫైర్ పెట్టుకుని వెళ్లిపోతున్నారు… ఇక ఇప్పుడు జరిగిన ఘటన వింటే ఎంతో ఆవేదన కలుగుతోంది.

 

రెండేళ్లుగా మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. ఆమె కుమార్తెపైనా కన్నేశాడు. కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు. ఇక ఆమె ఈ విషయం తల్లికి చెప్పింది, అయితే అతన్ని ఆపాల్సిన ఆ తల్లి ఏకంగా అతనికి నువ్వు సహకరించు అని చెప్పింది.. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది… ఇక ఇద్దరూ ఆ బాలికను చిత్ర హింసలు పెట్టారు.

 

చివరకు పోలీసులను ఆశ్రయించింది బాలిక. ఇక తండ్రిని తల్లి వదిలేసి రెండు సంవత్సరాలు అయింది… ఈ సమయంలో ఈ వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది, అతను ఈ బాలికపై కన్నేశాడు…తన కోరిక తీర్చాలని బలవంతం చేసేవాడు. అంతేకాదు ఎంత నీచమంటే ఆమె తల్లి ఏకంగా అతన్ని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పేది. ఈ ఘటన అద్దంకిలో జరిగింది. ఆ తల్లికి ఆ వ్యక్తికి కఠిన శిక్ష పడాలి అని మహిళా సంఘాలు కోరుతున్నాయి.