ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ రాత పరీక్ష..ఎంతమంది హాజరయ్యారంటే?

0
101
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,601 కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షను విజయవంతగా పూర్తిచేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 16,321 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ఏకంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇంత భారీఎత్తున కానిస్టేబుళ్ల నియామకాల కోసం పరీక్ష జరుగుతోంది. దీనితో తీవ్ర పోటీ నెలకొంది.
ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగ్గా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 91.34శాతం హాజరు నమోదైందని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేర్కొంది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్‌ హాజరు, వేలిముద్రల సేకరణ, డిజిటల్‌ విధానంలో ఫొటోలు సేకరించినట్లు పేర్కొంది. ప్రిలిమిని త్వరలోనే www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.