కన్న కూతురి మరణాన్ని జీర్ణించుకు కోలేకపోయిన ఒక తండ్రి ఆమెను తలుచుకుంటూ రోజు సమాధివద్దకు వెళ్లేవాడు… కుమార్తె లేనిదే తాను భ్రతకలేను అని చివరకు కూతురు సమాధివద్ద ప్రాణాలు వదిలాడు… వృదయవిదారకమైన ఈ సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది..
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నం జలాల్ పేటకు చెందిన గిరిబాబు రోల్డ్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నాడు… కొంతకాలం క్రితం తన పెద్ద కుమార్తె రేణుకాదేవి వివాహం చేశాడు… ఈ క్రమంలో అస్వస్తతకు గురి అయిన కుమార్తెను ఆసుపత్రిలో చేర్చారు…
ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటూ మృతి చెందింది… ఇక అప్పటి నుంచి కుమార్తెను తలుచుకుంటూ తరుచుగా ఆయన స్మశానానికి వెళ్లేవాడు.. ఈక్రమంలో తన కూతురు లేని జీవితం తనకు వద్దనుకుని సమాధివద్ద ప్రాణాలు వదిలాడు…
—