వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు, అయితే ఆమె తండ్రి మాత్రం వారి ప్రేమని ఒప్పుకోలేదు.. లాక్ డౌన్ కి ముందు మార్చి 10న అతని తల్లిదండ్రులు ఆమె ఇంటికి వెళ్లి పెళ్లికి అడిగారు. ఒకే కులం అయినా అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు.. ఇంకా ధనవంతులకి ఇచ్చి వివాహం చేస్తా అన్నాడు.
దీంతో అతని తల్లిదండ్రులు కూడా ఆమెని మర్చిపో అన్నారు, అయితే ఆమె మాత్రం అతనిని మర్చిపోయింది …ఈ మూడు నెలలు అతనితో ఫోన్ మాట్లాడలేదు, కాని ఈ సమయంలో రైల్వేలో పనిచేసే ఓ వ్యక్తితో ఆమెకి వివాహం నిశ్చయం చేశారు.
ఈ సమయంలో తను లేకుండా ఉండలేను అని ఆమెకి వివాహం ఏ సమయం ఏముహూర్తాన అవుతుందో తెలుసుకున్నాడు ప్రియుడు, అది ఫేస్ బుక్ లో చూశాడు, ఆ ఇన్విటేషన్ చూసి బాధపడ్డాడు, చివరకు అదే ముహూర్తాన తన పొలంలో పురుగుల మందు తాగేశాడు, అక్కడ కవులు రైతులు చూసి వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు.. ఇప్పుడు అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు, జోర్దర్ లో ఈ
దారుణం జరిగింది.