శుభవార్త..పసిడి పరుగుకు బ్రేకులు..నేటి ధరలు ఇలా?

0
104

బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్ గత మూడు రోజులుగా అధికంగా పెరగడంతో మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కానీ నేడు బంగారం ధరలు భారీగా తగ్గి నేలచూపులు చేస్తుండడంతో మహిళలు ఆనందపడుతున్నారు.

నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

మార్కెట్‌ లో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గి 10 గ్రాములకు రూ. 51,980కు దిగి వచ్చింది. ఒక్కసారే బంగారం ధరలకు బ్రేకులు పడడం మహిళలు ఆనందపడే  విషయంగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వెండి ధరలు విషయానికి వస్తే కిలో వెండి ధర రూ. 500 తగ్గి రూ.66 వేలకు గా నమోదు అవుతుంది. దాంతో బంగారం ప్రియులు వచ్చే వారంలో కూడా ఇవే ధరలు కొనసాగాలని అభిప్రాయపడుతున్నారు.