అన్న మరణం తట్టుకోలేక ఆగిన చెల్లి గుండె

Unable to digest Anna's death .. Chelly has a heart attack

0
118

తోడపుట్టిన అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ఆ యువతి. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తోడుగా ఉండే అన్న..ఆసుపత్రిలో విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. తనకు ఏ కష్టం వచ్చిన ముందుండే అన్న ఇక లేడనే వార్త ఆమె తట్టుకోలేకపోయింది. అన్నను చివరిచూపు చూడడానికి వచ్చిన ఆ చెల్లెకు అవే చివరి క్షణాలు అయ్యాయి. తల్లిదండ్రులతో పాటు అన్న మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆమె.. అక్కడే గుండెపోటుతో మృతి చెందింది. కర్ణాటకలోని మైసూరులో ఈ హృదయవిదారక ఘటన జరిగింది.