పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న మంత్రి..అక్కడ ఏమన్నారంటే?

0
101

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అక్కడికి వచ్చారు.

నిన్న రాత్రి కాలినడకన మంత్రి హరీష్‌రావు తిరుమల‌కు చేరుకుంటున్న క్రమంలో ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి మంత్రి దర్శనానికి అన్ని సన్నాహాలు చేసారు. స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్న అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..నేడు తన పుట్టిన రోజు సందర్భంగా 50వ ఏటలో అడుగుపెడుతూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుమ‌ల వచ్చినట్లు వెల్లడించారు. ఇంకా మంత్రి హరీష్‌రావు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు