కేజీ మట్టి ఖరీదు ఆరు లక్షల కోట్లు – ఏమిటా మట్టి స్పెషాలిటీ

mars planet special story

0
129

 

టైటిల్ చూసి షాక్ అయ్యారా? ఏమిటి మట్టి ఖరీదా లేదా ఆ భూమి విలువా అని ఆశ్చర్యం కలిగిందా? మీరు విన్నది నిజమే. అయితే ఆ మట్టి ఇక్కడిది కాదు. నాసా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువును భూమి మీదకు తీసుకురాబోతోంది అదే ఈ మట్టి. అంగారక గ్రహం నుంచి సేకరించిన దుమ్ముమట్టిని ఎర్త్ మీదకి తీసుకువస్తోంది నాసా. ఇలా ఆ మట్టి వస్తే ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు ఈ మట్టే అవుతుంది.

ఈ మట్టి తీసుకువచ్చిన తర్వాత భూమిపై అనేక పరిశోధనలు చేస్తారు. మార్స్ నుండి ఒక కిలోగ్రాము మట్టిని భూమి మీదకు తెస్తుంది. దీంతో అంగారక గ్రహంపై పురాతన జీవుల జాడలను పరిశీలించనున్నారు. ఈ పరిశోధన చాలా వరకూ అన్నీ దేశాలకు ఉపయోగపడుతుంది.

నాసాకి మూడు మిషన్లను పైకి తీసుకుని వెళ్లేందుకు 9 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. అక్కడ రోవర్ ద్వారా అంగారక గ్రహం పై ఉపరితల వాతావరణ పరిస్దితులు డేటా అంతా సేకరిస్తున్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగే ప్రాసెస్ కాదు, ఈ మట్టి తీసుకురావడానికి పదేళ్ల సమయం పట్టవచ్చట.