టీవీ ఏమిటి షాక్ కి గురి చేయడం ఏమిటి? పరుగులు పెట్టించడం ఏమిటి అని అనుకుంటున్నారా
బ్రిటన్లో ఓ డొక్కు టీవీ వల్ల ఊరి మొత్తానికి ఇంటర్నెట్ రాకుండా పోయింది.. ఇదేమిటి టీవీ వల్ల ఇంటర్నెట్ ఆగిపోవడం ఏమిటి అని ఆశ్చర్యం కలుగుతుందా, అయితే ఇది జరిగింది. ఇక్కడ మరో విషయం ఊరంతా ఇలా నెట్ ఆగిపోతోంది అని ఆటీవీ ఓనర్ కు తెలియదు పాపం.
ఓపెన్రీచ్ అనే సంస్థకు చెందిన ఇంజనీర్లు ఎందుకు గ్రామంలో ఇలా నెట్ రావడం లేదు అని ఆలోచించారు, మొత్తం కేబుల్స్ మార్చారు అయినా వచ్చేది కాదు..పొవిస్ అనే ప్రాంతంలోని అబెర్హోసన్ అనే ఊర్లో ఓ వ్యక్తి పాత టీవీ కొన్నాడు, ఉదయం 7 గంటలకు న్యూస్ చూసేవాడు, అంతే అప్పటి వరకూ వచ్చిన ఇంటర్ నెట్ ఆగిపోయేది.
పాత టీవీ కావడంతో దాని నుంచి ఓరకమైన ఎలక్ట్రిక్ తరంగాలు వెలువడేవి. బ్రాడ్బాండ్ సిగ్నల్ మీద వాటి ప్రభావం పడేది, అందుకే అతను టీవీ ఆన్ చేస్తే ఆ సిగ్నల్స్ ఆగిపోయేవి, అసలు దీనికి కారణం ఏమిటి అని ఆ కంపెనీ వారు సంవత్సరం తర్వాత స్పెక్ట్రమ్ అనలైజర్ పెట్టారు, ఊరంతా చూస్తే ఇతని ఇంటి దగ్గర ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్ వస్తున్నట్లు ఆ పరికరం గుర్తించింది. దీంతో ఆ టీవీ వల్ల ఇలా జరుగుతుంది అని గుర్తించి ఆ టీవీ తీయించేశారు, మొత్తానికి ఏడాదిన్నర పాటు ఉద్యోగులకి గ్రామస్తులకి షాకిచ్చింది ఆ టీవీ.