వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు దూసుకెళ్తున్నాయి..వరంగల్ మార్కెట్లో క్వింటాకు రూ .9,300 ధర పలకంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో ఇదే పెద్ద రికార్డుగా ప్రభుత్వం గుర్తించింది. ఇతర రాష్ట్రాలో అధిక వర్షాలు పడడంతో దిగుబడి తగ్గింది. దాని వల్ల దక్షిణాది రాష్ట్రాలో పత్తికి డిమాండ్ మరి పెరగడంతో కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధర పలుకుతుంది.
మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో రైతులకు క్వింటాల్‌కు రూ.9000 వరకు ధర లభిస్తోంది. పత్తి ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.6250. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. మరోవైపు ధరలు పెరుగుతాయన్న వార్తలతో రైతులు పత్తిని నిల్వ చేస్తున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ధర.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెరగవచ్చని అంచనా.
తక్కువ ఉత్పత్తి, ఎక్కువ డిమాండ్ కారణంగా వ్యాపారులు పత్తిని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ పత్తి వ్యాపారులు పత్తి క్వింటాల్‌కు రూ.8300 నుంచి 8500 వరకు కొంటున్నట్లు తెలుస్తోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ పెరిగింది. పత్తికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు సోషల్ మీడియాలోనే రైతులతో భేరసారాలు నడిపిస్తున్నారు.