దేవుడి పూజలో పువ్వులను వాడడం వెనుక గల అసలు కారణాలివే..!

0
113

సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుడిని పువ్వులతో అలంకరించి పూజిస్తుంటాము. పువ్వులతో అలంకరించి పూజ చేయడం అనేది పూర్వం నుండి వస్తున్న ఒక ఆనవాయితీ. కానీ దీని వెనుక అసలు కారణం ఎంటో, వాటి ఉపయోగం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మాములుగా దేవుడిని తామర పువ్వులు, కల్వ పువ్వులు, జాజులు, కనకాంబరాలు నీలాంబరాలు, చామంతి, నందివర్ధములు, పారిజాతాలు, ఎర్రగన్నేరు, మందారం, మంకెన,మునుగోరింట, గరుడవర్ధనం, మాలతి, నిత్యమల్లి వంటి పుష్పాలతో పూజించడం మనం గమనిస్తుంటాము. స్వచ్ఛమైన మనసుతో పువ్వును అర్పించడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

అంతేకాకుండా భక్తితో స్వచ్ఛమైన మనసుతో స్వామి వారిని వేడుకుంటారో వారి వెన్నంటే ఉండి కాపాడుతారని నమ్ముతారు. అందుకే మనం పూజ చేసేటప్పుడు దేవుడిని పువ్వులతో అలకరిస్తాము. అందుకే ఇంత పవిత్రమైన పువ్వులను పురుడు పోసుకున్న వారు, నెలసరి అయిన వారు తాకకూడదని చెబుతుంటారు.