‘టీటీడీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం పాత్ర కీలకం’

'The role of the civil engineering department in TTD is crucial'

0
104

శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ (శ్వేత) లో బుధవారం ఇంజినీరింగ్ అధికారులకు ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. సివిల్ ఇంజినీరింగ్ లో రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న పరిజ్ఞానం, మెళకువలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా సంస్థకు మరింత ఉన్నత సేవలు అందించే అవకాశం కలుగుతుందని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిపుణులు ప్రవీణ్ కుమార్ చెప్పారు. అలాగే ఇంజినీరింగ్ లేనిదే టెక్నాలజీ లేదని చెప్పారు. రోడ్లు, భవనాల నిర్వహణ, లీకేజీలు అరికట్టడం, టెండర్లు నిర్వహణ అంశాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల నిర్వహణ అంశాలపై ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

తెలియంది నేర్చుకోవడానికి వయసుతో పనిలేదని, నూతన పరిజ్ఞానం,మెళకువలు అందిపుచ్చుకోవడం వల్ల సంస్థకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. టీటీడీలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. టీటీడీ ఎస్ ఈ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. అనుభవంతో పాటు ఇంజినీరింగ్ లో జరుగుతున్న మార్పులు, నూతన మెళకువలు ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

శ్వేత డైరెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ..ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిపుణులు వచ్చి శిక్షణ ఇవ్వడం సంతోషకరమన్నారు. టీటీడీ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగం పాత్ర కీలకమని, నూతన మెళకువలు తెలుసుకోవడం మంచిదని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రసాద్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.