కూలిన పాఠశాల పైకప్పు..ముగ్గురు విద్యార్థులకు గాయాలు

0
92

ప్రభుత్వ నిర్లక్ష్యం సర్కారు బడుల్లో చదివే పిల్లల పాలిట శాపంగా మారింది. పాఠశాలలు తెరిచి 3 నెలలు కావొస్తున్న సరైన బిల్డింగ్ వసతి లేక ఇక్కట్లు పడుతున్నారు. తాజాగా ములుగు జిల్లాలో పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. జిల్లాలోని ఎదిర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.